పుంగనూరుముచ్చట్లు:
పోలియో మహమ్మారి వ్యాధిని నివారించేందుకు ప్రతి ఒక్కరు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని డిపిఎంవో రమేష్‌బాబు, అడిషినల్ ఎస్పీ వెంకటాద్రి లు కోరారు. ఆదివారం మండలంలోని ముడిబాపనపల్లె పిహెచ్‌సిలో పోలియో చుక్కలు వేసి శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే మున్సిపాలిటిలో పోలియో చుక్కలు వేశారు. రమేష్‌బాబు మాట్లాడుతూ 86 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి మండలంలో 8,351మందికి, పట్టణ పరిధిలో 4,851 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. అందరి సహకారంతో కార్యక్రమం జయప్రదం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సుబ్బరాయుడు, మార్కెట్ కమిటి చైర్మన్ సమీపతి, మెడికల్ ఆఫీసర్ సృజన, డాక్టర్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.
Tags;DPMO and Additional SP administer polio drops.