June 28, 2026
Explore
ఓటు కోల్పోతే నష్టమే

ఓటు కోల్పోతే నష్టమే

June 28, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌) కార్యక్రమంలో ప్రతి ఓటరు తమ ఓట్లను పరిశీలించుకోవాలని , లేకపోతే తీవ్ర నష్టమేనని వైఎస్సార్‌సిపి జిల్లా మైనార్టీ సెల్‌ కార్యదర్శి కిజర్‌ఖాన్‌ తెలిపారు. ఆదివారం ఆయన పట్టణంలోని సుబేదారువీధి, సుల్తాన్‌సాబ్‌వీధి, నానబాలవీధి ప్రాంతాలలో ఎన్యూమరేషన్‌ ఫారాలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. బిఎల్‌ఏ, బిఎల్‌వోలతో కలసి ఓటర్ల పరిశీలన చేపట్టి, డిజిటల్‌ ఆన్‌లైన్‌ చేయించారు. కిజర్‌ఖాన్‌ మాట్లాడుతూ మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గంలోని ప్రధాన కేంద్రమైన పుంగనూరు పై రాష్ట్రమంత దృష్టి సారించిందన్నారు. ప్రతి వార్డులోను కూటమి ప్రభుత్వం తమ శక్తి మేరకు ఓట్లు లేకుండ చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సిపి శ్రేణులు ఐకమత్యంతో ఇంటింటికి వెళ్లి ఓటర్ల పరిశీలన చేయించి, ఓట్లు కోల్పోకుండ చూడాలని కోరారు. ఈకార్యక్రమంలో మైనార్టీ నాయకులు అయాజ్‌, ఏజాజ్‌, నూర్‌, లియాఖత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags; Losing the vote means a loss.