June 28, 2026
Explore
ఫారాలను తిరిగి ఇవ్వండి-నిసార్ అహ్మద్

ఫారాలను తిరిగి ఇవ్వండి-నిసార్ అహ్మద్

June 28, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

భర్తీ చేసిన ఓటరు ఫారాలను ప్రతి ఒక్కరు బిఎల్ఓలకు తిరిగి ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని 14వ వార్డుకు చెందిన 191, 192, 193 పోలింగ్ కేంద్రాల పరిధిలో పర్యటించారు. ఓటర్లతో మాట్లాడి అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో పేర్లు ఉండాలంటే ఫారాన్ని తప్పనిసరిగా పూర్తి చేసి సంబంధిత బీఎల్‌వోలకు అందించాలని సూచించారు. ఫారాలు తీసుకువచ్చిన ప్రజలకు బీఎల్‌ఏలతో పరిశీలించి, సహకారం అందించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమను సంప్రదించాలని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ఉండేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రతి వార్డులో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల ద్వారా ప్రజలకు సహాకారం అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్ఏ. కరీముల్లా, మాజీ కౌన్సిలర్లు అస్మత్ జాన్, షబానా, విఎస్.రెడ్డి, ఎన్.నవాజ్, బయ్యారెడ్డి, మల్లికార్జున రెడ్డి , శంకర్ నాయక్, సిటిజన్ బాషా, మధు, వడిగల శ్రీకాంత్, రమాదేవి, కవిత, రఫీ బీఎల్‌ఏలు పాల్గొన్నారు.

Tags; Return the forms – Nisar Ahmed