June 27, 2026
Explore
చౌడేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. రైతుకు తీవ్ర గాయాలు

చౌడేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. రైతుకు తీవ్ర గాయాలు

June 27, 2026 | Andhra Pradesh

చౌడేపల్లి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. సోమల మండలం సి.వడ్డిపల్లికి చెందిన రైతు రామచంద్ర వ్యక్తిగత పనిపై బైక్‌పై పుంగనూరుకు వెళ్తుండగా, చౌడేపల్లి చారాల హైస్కూల్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామచంద్ర అపస్మారక స్థితికి చేరుకోగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Road accident near Chowdepalli; farmer sustains severe injuries.