June 27, 2026
Explore
సింహవాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీ వేంకటేశ్వరస్వామి

సింహవాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీ వేంకటేశ్వరస్వామి

June 27, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

రాత్రి ముత్యపు పందిరి వాహనంపై మరో దివ్య దర్శనం

హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారు సింహవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి ఆశీర్వదించారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో వైభవంగా జరిగిన వాహనసేవ భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది.

సింహవాహన మహిమ

ధర్మాన్ని కాపాడి, దుష్టులను శిక్షించేందుకు శ్రీహరి సింహవాహనాన్ని అధిష్ఠిస్తారు. సింహం ధైర్యం, పరాక్రమం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. సింహవాహనంపై స్వామివారిని దర్శించడం వల్ల భక్తుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, ధర్మబద్ధంగా జీవించే స్ఫూర్తి పెరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ ఉత్సవం ద్వారా అజ్ఞానాన్ని తొలగించి ధర్మమార్గంలో నడవాలని స్వామివారు సందేశం ఇస్తున్నారని భక్తులు విశ్వసిస్తారు.

రాత్రి 7.30 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు మరోసారి భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించనున్నారు.ఈ కార్యక్రమంలో ఏఈవో బాలరాజు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ మోహన్ రెడ్డి, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

Tags: Lord Sri Venkateswara blesses devotees while mounted on the Lion Vahanam.