పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం కంటి వైద్యశిబిరానికి అపూర్వ స్పందన లభించింది. సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి ఆధ్వర్యంలో శంకర్‌నేత్రాలయ వారి వైద్యబృదం కంటి జబ్బులు కలిగిన వారికి చికిత్సలు చేశారు. అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. చెంగారెడ్డి మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న సూక్తి మేరకు మనిషికి కళ్లు ఎంతో ప్రధానమైనదని, కంటిని కాపాడుకోవడంలో ఎవరు నిర్లక్షం చేయవద్దని కోరారు. ఈ శిబిరానికి 96 మంది హాజరై చికిత్సలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు నాగరాజ, మునస్వామి వెహోదలియార్, వెంకటపతి, సుబ్రమణ్యం, గంగులమ్మ తదితరులు పాల్గొన్నారు.
Tags: Overwhelming response to the eye camp