June 27, 2026
Explore
పాలన పడకేసిందా..?

పాలన పడకేసిందా..?

June 27, 2026 | Andhra Pradesh

-ప్రత్యేక పాలనలోను అధ్వానమే…
-జూనియర్‌ అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టరా…?

  • తొలగించని చెత్త దిబ్బలు
  • ప్రభలుతున్న దోమలు
    -పర్యావరణం కనుమరుగు

పుంగనూరుముచ్చట్లు:

వైఎస్సార్‌సిపి మున్సిపల్‌ పాలకవర్గ పదవికాలం మార్చి17 న ముగిసింది. మూడు నెలల్లో పరిపాలన పడకేసిందా…? అన్న అనుమానం మున్సిపల్‌ ప్రజల్లో కలుగుతోంది. పట్టణంలో చెత్త, మురుగునీటి కాలువలు సరిగా శుభ్రం చేయకపోవడంతో దోమలు ప్రభలి ప్రజలు జ్వరాల భారీన పడుతున్నారు. అలాగే ప్రతిశాఖలోను అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు. వైఎస్సార్‌సిపి కౌన్సిలర్లు, చైర్మన్‌ ఉండటంతో ప్రతి రోజు పాలకవర్గ సభ్యులు తమ వార్డులలో పర్యటించి , సమస్యలను గుర్తించి పరిష్కరించేవారు. మూడు నెలల కాలంలో ఎక్కడి గొంగళి అక్కడే అన్న విధంగా సమస్యలు విలయతాండవం చేస్తోంది.

కుర్చీ లేని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌….

మున్సిపాలిటికి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా నవరత్న ను ఆరు నెలల క్రితం ప్రభుత్వం నియమించింది. కానీ ఇన్‌చార్జ్గా జూనియర్‌ అసిస్టెంట్‌ మునివెంకటప్ప కొనసాగిస్తూ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు కుర్చీ ఇవ్వకపోవడం గమనార్హం. ఎస్‌ఐ ఉన్న అధికారం ఇవ్వకపోవడం వెనుక కారణాలు ఉన్నతాధికారులకు తెలియాలి.

పారిశుద్ధ్యం ఎక్కడ …?

అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, చెత్తను ప్రతి రోజు తొలగించాలన్న నిబంధనలను ప్రక్కన పెట్టారు. కుంటి సాకులతో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో మాత్రమే చెత్తను తొలగించడం ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. ఫాగింగ్‌ ఊసేలేదు. దోమలు ప్రభలి ప్రజలు జ్వరాలతో ఆసుపత్రుల్లో మకాం పెట్టాల్సి వచ్చింది. పారిశుద్ధ్య కార్యక్రమాలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న ఫలితం మాత్రం శూన్యం అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పర్యావరణం ఊసేలేదు…..

పట్టణంలో వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో మిని బైపాస్‌ రోడ్డు రూ.4 కోట్లు ఖర్చు చేసి వేశారు. ఎల్‌ఈడి దీపాలు ఏర్పాటు చేశారు. పచ్చదనాన్ని పెంపొందించి, పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు డివైడర్లపై ముడా ఆధ్వర్యంలో పూల కుండీలు ఏర్పాటు చేశారు. అధికారులు వాటికి నీరు పోయించకపోవడంతో అవి చెత్త, చెదారం నిండి ఎండిపోతున్నాయి . ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం జోరుగా సాగుతోంది. అధికారుల నామమాత్రపు తనిఖీలు ప్లాస్టిక్‌ వినియోగాన్ని అడ్డుకోలేకపోతోంది. దీని కారణంగా మున్సిపాలిటిలో పర్యావరణం పత్తాలేకుండ పోతోంది.

నీటి సమస్య…….

వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో రెండురోజులకొక్కసారి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేశారు. పాలకవర్గం లేకపోవడంతో తాగునీరు మూడురోజుకొక్కసారి కూడ రాకుండ పోతోంది. అలాగే బోర్లు మరమ్మతులకు గురై నెల రోజులు గడుస్తున్న మరమ్మతులకు నోచుకోకపోవడంతో శాంతినగర్‌ వద్ద గల రాగానిపల్లె రోడ్డులో మరమ్మతులకు నోచుకోని బోరు అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. విస్తరణ ప్రాంతాలలో ట్యాంకర్లు ద్వారా కూడ సక్రమంగా నీటిని సరఫరా చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

సమస్యలపై పోరాడం….

మున్సిపాలిటి పరిధిలో ప్రతి రోజు తిరుగుతూ ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు వెంటపడ్డాం. ప్రస్తుతం ప్రజా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు. నీరు , పారిశుద్ధ్యం, ప్లాస్టిక్‌ వినియోగం పై అధికారులు దృష్టి సారించలేదు. ఎస్‌ఐఆర్‌ పూర్తి కాగానే పట్టణంలో పర్యటించి సమస్యలపై పోరాటం చేస్తాం.

  • అలీమ్‌బాషా, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌. పుంగనూరు.

అధికారుల నిర్లక్షం ……

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్షం ప్రజలకు శాపంగా మారుతోంది. ప్రత్యేక పాలనలో కూడ సమస్యలు విలయతాండవం చేస్తోంది. దోమలు తీవ్రమైంది. ఫాగింగ్‌ పత్తాలేదు. నీరు ఎప్పుడు వదులుతారో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారు.

  • ఫకృద్ధిన్‌షరీఫ్‌, మైనార్టీల నాయకుడు. పుంగనూరు.

Tags:Has the administration ground to a halt?