అమరావతిముచ్చట్లు:
ఏపీలో ఈనెల 27-29 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మాత్రమే వానలు పడతాయని పేర్కొన్నారు. ఈమేరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Tags: Heavy rains in AP for 3 days