June 27, 2026
Explore
రాష్ట్ర డీజీపీని కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ .

రాష్ట్ర డీజీపీని కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ .

June 27, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

చిత్తూరులో శుక్రవారం రాత్రి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్,. పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ గారిని ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిసి, పూలమొక్క అందించి సాదర స్వాగతం పలికారు.

అనంతరం జరిగిన సమావేశంలో ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణపై డీజీపీ విస్తృతంగా చర్చించారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన పోలీసింగ్ సేవలు అందించాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించే శక్తులపై కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

Tags: Annamayya District SP met the State DGP.