నల్గొండ ముచ్చట్లు:
వారం రోజులుగా నల్గొండనే కాదు… రాష్ట్రాన్నే ఉలిక్కిపడేలా చేసిన నాలుగు హత్యల కేసు… చివరకు ఛేదించారు నల్గొండ పోలీసులు…
తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన సుల్తాన్, హసీనా, ముజమ్మిల్, అఫ్కూరా మృతదేహాలు ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో లభించడంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది…
మొదట ఇది హత్యా… ఆత్మహత్యా… అనే అనుమానాలతో ప్రారంభమైన దర్యాప్తు… చివరకు ఊహించని నిజాలను బయటపెట్టింది…
బంధుత్వమే నమ్మకం… అదే బంధుత్వం రక్తపాతానికి దారి తీసింది!
హసీనా ఇంటి తలుపు తట్టింది పరాయి వ్యక్తి కాదు… సొంత అక్క కూతురు తబస్సుం భర్త సయ్యద్ అస్లాం….
బంధుత్వం… పరిచయం… నమ్మకం… ఇవే చివరకు ఆ కుటుంబానికి శాపంగా మారింది…
ఈ కేసులో ప్రధాన నిందితుడు సయ్యద్ అస్లాం. అతడి భార్య తబస్సుం, స్నేహితుడు మహమ్మద్ సోహైల్, బంగారం తాకట్టు తీసుకున్న జ్యువెలర్ హేమంత్ కుమార్ను పోలీసులు అరెస్ట్…
మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్!
అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, పాత కక్షలు కలిసి ఈ దారుణానికి దారి తీశాయి…
హసీనా ఇంట్లో నగదు, బంగారం ఉన్నాయని తెలుసుకున్న అస్లాం… హత్యకు ముందే యూట్యూబ్‌లో పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి? శవాలు ఎన్ని రోజులకు కుళ్లిపోతాయి? వంటి వీడియోలు చూసినట్లు విచారణలో వెల్లడైంది…
జూన్ 19 అర్ధరాత్రి నల్గొండకు చేరుకున్న అస్లాం… తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి ముందుగా హసీనాపై కత్తితో దాడి చేశాడు. ఆమె కేకలు విని బయటకు వచ్చిన సుల్తాన్‌ను హత్య చేశాడు…
ఆ తర్వాత ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించిన ముజమ్మిల్తో పెనుగులాట జరిగినా… చివరకు అతడినీ హత్య చేశాడు…
ఇదంతా చూసిన 12 ఏళ్ల అఫ్కూరా మంచం కింద దాక్కుంది. తనను గుర్తిస్తుందనే ఉద్దేశంతో ఆమెను కూడా బయటకు లాగి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు…
నలుగురూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత… ఇంట్లోని బంగారం, నగదు, భూమి, బ్యాంకు పత్రాలు తీసుకుని… మృతదేహాలపై చద్దర్లు కప్పి… ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్లు దర్యాప్తులో తేలింది…
దోచుకున్న బంగారాన్ని మహమ్మద్ సోహైల్ సహాయంతో హేమంత్ కుమార్కు తాకట్టు పెట్టి నగదు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు…
సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యేక బృందాల దర్యాప్తుతో కేవలం మూడు రోజుల్లోనే ఈ సంచలన కేసును నల్గొండ పోలీసులు ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు…
ఒక కుటుంబాన్ని బలి తీసుకున్న డబ్బు ఆశ… చివరకు నిందితులను కటకటాల వెనక్కి నెట్టింది…
ఇట్టి కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కేవలం 3 రోజుల్లోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను పట్టుకున్న నల్గొండ డి.ఎస్.పి కె. శివరాం రెడ్డి గారిని, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని, టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాఘవరావు గారిని, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారిని, జితేందర్ రెడ్డి గారిని, రూరల్ ఎస్సై శివప్రసాద్ గారిని, టూ టౌన్ ఎస్సై సైదాబాబు గారిని, నకిరేకల్ ఎస్సై వీరబాబు గారిని, అలాగే సీసీఎస్ బృందం సభ్యులైన విష్ణు వర్ధనగిరి, నాగార్జున ప్రసాద్, పుష్పగిరి, వైదుపాషా, సాయి శివరాజ్ మరియు నల్గొండ టౌన్ పోలీస్ సిబ్బందిని నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.
Tags: Nalgonda quadruple murder mystery… Killers finally caught!