June 26, 2026
Explore
చిన్నశేష వాహనంపై వేణుగోపాలస్వామి

చిన్నశేష వాహనంపై వేణుగోపాలస్వామి

June 26, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

చిన్నశేష వాహనంపై వేణుగోపాలస్వామి అలంకారంలో భక్తులను కటాక్షించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

అప్పలాయగుంట బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఆధ్యాత్మిక వైభవం

ఈ రాత్రి హంస వాహనసేవ

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై వేణుగోపాలస్వామి అలంకారంలో దివ్య మంగళ దర్శనం ప్రసాదించి భక్తులను అనుగ్రహించారు.

పంచభూతాలకు ప్రతీకగా చిన్నశేష వాహనం

చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పంచభౌతిక ప్రకృతికి ప్రతీకగా భావిస్తారు. పంచశిరస్సులతో కూడిన చిన్నశేషునిపై స్వామివారిని దర్శించడం ద్వారా భక్తులకు సర్వశుభాలు, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని ఆగమ, పురాణాలు పేర్కొంటున్నాయి.

ఈ రాత్రి హంస వాహనసేవ

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనసేవ వైభవంగా నిర్వహించనున్నారు.ఈ వాహనసేవలో ఆలయ ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో రాధాకృష్ణ, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

Tags: Lord Venugopala Swamy on the Chinna Sesha Vahanam.