పుంగనూరుముచ్చట్లు:
మొహరం పండుగను పురస్కరించుకుని పట్టణంలోని కుమ్మరవీధి, సుబేదారువీధి, ప్యాలెస్ ఆవరణంలో ముస్లింలు పీర్ల పండుగను కోలాహలంగా నిర్వహించారు. అలాగే మండలంలోని కుమ్మరగుంట, మేలుందొడ్డి గ్రామాల్లో ప్రార్థనలు చేశారు. పీర్లకు అత్యంత సుందరంగా పూలు అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. పీర్ల చావిడిలో పీర్లకు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి అగ్నిగుండం ఏర్పాటు చేశారు. పలువురు ప్రార్థనలు చేస్తూ అగ్నిగుండంలో ప్రవేశం చేశారు. మతగురువుల ప్రార్థనల నడుమ హిందూముస్లింలు అధిక సంఖ్యలో మొహరం వేడుకల్లో పాల్గొనడం గమనార్హం.



Tags; Fervor during Muharram celebrations