June 26, 2026
Explore
ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం కలకలం

ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం కలకలం

June 26, 2026 | Andhra Pradesh

నిమ్మనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా లోని మదనపల్లె నియోజకవర్గం, నిమ్మనపల్లె మండలంలో ఒకేరోజు ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఇద్దరూ 16 ఏళ్ల వయసున్న మైనర్లు కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలికల అదృశ్యంపై తల్లి దండ్రులు వేర్వేరుగా నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్సై రామకృష్ణ బాలికల అదృశ్యం పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారంతో ఎవరితోనైనా వెళ్లిపోయారా..? లేక ఇతర కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బాలికల ఆచూకీ కోసం ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం ఎస్సై రామకృష్ణ వెల్లడించాల్సి ఉంది.

Tags; Disappearance of two minor girls on the same day in Nimmanapalle causes a stir.