పుంగనూరుముచ్చట్లు:
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఒక ప్రాంతంలోనే ఓటు ఉండాలని, రెండు ఓట్లు కలిగి ఉంటే కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎలక్ట్రోల్ ఆఫీసర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన తహశీల్ధార్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను 2.40 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, ప్రతి ఇంటికి బిఎల్‌వోలు వెళ్లి రెండు ఎన్యూమరేషన్ ఫారములు అందజేయడం జరిగిందన్నారు. ఓటర్లు అందరు తమ సమాచారాన్ని పక్కాగా ఇవ్వాలన్నారు. రెండు ఓట్లు ఉన్న వారు ఇప్పుడే ఒక ప్రాంతంలో మాత్రమే ఓటరుగా ఎన్యూమరేషన్ ఫారం అందించాలన్నారు. లేకపోతే విచారణలో రెండు, ఆపైగా ఓట్లు ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, దీని ద్వారా శిక్షార్హులౌతారన్నారు. బిఎల్‌వోలు ప్రతి ఇంటా సమగ్రంగా సర్వే నిర్వహించడం జరుగుతోందని, ఎలాంటి పొరపాట్లు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ సమావేశంలో తహశీల్ధార్ రాము పాల్గొన్నారు.
Tags: Vote must be in only one area – Electoral Officer Chandrashekhar Reddy