పుంగనూరుముచ్చట్లు:
పదోతరగతి పరీక్షల్లో తెలుగుబాషలో అత్యధిక మార్కులు సాధించిన జెడ్పి హైస్కూల్ బాలికలను తెలుగు ఫౌండేషన్ వారు సన్మానించారు. శుక్రవారం తిరుపతిలో సంస్థ ప్రతినిధులు శ్రీనివాసులు, డాక్టర్ సాకం నాగరాజు, మల్లెల సుబ్రమణ్యం, రఘునాథ్, యువశ్రీ మురళి ఆధ్వర్యంలో స్థానిక హైస్కూల్‌కు చెందిన హర్షిత, నవ్య, అప్రీన్‌ఖాన్, గాయిత్రి, ఎ.నవ్య లను సన్మానించి మెమెంటోలు, ప్రశంసాపత్రాలు ఇచ్చి సత్కరించారు. విద్యార్థులు తెలుగుబాషలో సంసిద్దులైయ్యేలా కృషి చేసిన ఉపాధ్యాయులు జివి.రమణ, సుగుణ, ముత్యాలు ను కూడ ఫౌండేషన్ వారు సన్మానించి మెమెంటోలు ఇచ్చారు.

Tags: Telugu Foundation Honors Students