క్రీ.శ.1700 సంవత్సరంలో ఏర్పాటు
-శ్రీబోయకొండ గంగమ్మ పుట్టినిల్లు
- కారు చీకటిలో కాటిపేరి వెలుగులు
- దేశ సేవలో 60 మంది యువత
- న్యాయసేవలో 9 మంది
- సాప్ట్వేర్లు 70 మంది
పుంగనూరుముచ్చట్లు:
ఎంతో మందికి ఉన్నత పదవులు, ఉన్నత వ్యాపారాలలో స్థిరపడేలా యువకులు పుట్టిన కావడి అనే కాటిపేరి గ్రామం నాటి కారు చీకటి నుంచి నేడు వెలుగులు జిమ్ముతోంది. రాష్ట్రంలో నాల్గవ ప్రసిద్ధి క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ పుట్టినిలైన కాటిపేరి గ్రామం పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలో మేజర్ పంచాయతీగా ఉంది. ఇక్కడ అన్ని మతాలకు చెందిన సుమారు 600 కుటుంభాలు నివసిస్తూ , కులమతాలకతీతంగా పండుగలు, జాతరలు నిర్వహిస్తూ ఆదర్శంగా కాటిపేరి గ్రామం నిలుస్తోంది.
వృత్తి ఉద్యోగ, వ్యాపారాలలో ….
కాటిపేరి గ్రామంలో జన్మించిన వారు ఎన్నో ఉన్నత పదవులు పొందారు. వృత్తి, వ్యాపారాలలో స్థిరపడ్డారు. వారిలో మాజీ డీజిపి గురునాథరావు ఐపిఎస్ ఒకరు .విశ్రాంత కెప్టన్ కృష్ణప్ప ,ఆయన కుమారుడు రక్షణ విభాగంలో బ్రిగేడియన్ సిడి.శ్రీనివాస్ ప్రస్తుతం కొనసాగుతున్నారు. అలాగే ఇద్దరు ప్రముఖ డాక్టర్లు జ్ఞానావతి, రెడ్డికార్తీక్ లు ఉన్నారు. న్యాయవాది వృత్తిలో శ్రీనివాసమూర్తి, నరసింహమూర్తి, నాగరాజు, సుధాకర్‌రెడ్డి, ఆనంద్‌కుమార్, రఘునాథరెడ్డి, కుమార్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సందీప్‌మహేష్, బాలాజి, శివప్రసాద్, సాయిహేమంత్, కోర్టు ఉద్యోగులు బాలప్ప, ఉమామహేశ్వర్, శ్రీవాణి లు కాటిపేరిలో ఉన్నారు. అలాగే 60 మంది కాటిపేరి యువత దేశ రక్షణ విభాగాల్లో వివిధ ఉద్యోగాలలో ఉన్నారు. సాప్ట్వేర్ ఇంజనీర్లుగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, దుబాయ్ , యూఎస్‌ఏ లలో 70 మంది ఉన్నారు. అలాగే 13 మంది టీచర్లు ఉన్నారు. వీరు కాకుండ మరో 30 మంది వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర సర్వీసులలో ఉద్యోగాలు చేస్తున్నారు.
కొలువైన ఆలయాలు…
కాటిపేరి గ్రామ మహద్వారంలో శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి ఆలయం, శ్రీపటాలమ్మ ఆలయం, శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, శ్రీ చెన్నరాయస్వామి ఆలయం ఉంది. శ్రీబోయకొండ గంగమ్మ ఆలయం, శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం, శ్రీరామాలయం , శ్రీమారెమ్మ ఆలయము, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, శ్రీ షిరిడిసాయిబాబా ఆలయాలు కొలువై ఉన్నాయి.
జాతర, పండుగలకు రాక….
కన్నతల్లిని, కాటిపేరిని ఎక్కడికి వెళ్లిన మరచిపోకుండ పండుగలకు, జాతర్లకు యువత కుటుంబ సభ్యులతో కలసి ఉద్యోగాలకు సెలవు పెట్టి పుట్టినింటికి చేరుకోవడం , తల్లిదండ్రులు, బంధుమిత్రులతో కాలక్షేపం చేయడం ఈ ప్రాంత వాసుల ఐకమత్యానికి నిదర్శనం. ఏటా వినాయకచవితి, సంక్రాంతి పండుగలకు ,జూలై 1న జరిగే జాతరకు అందరు కలవడం ప్రత్యేకతను సంతరించుకుంది.
కాటిపేరికి వెలుగులు….
శ్రీ బోయకొండ అటవీప్రాంతానికి సమీపంలో ఎలాంటి సౌకర్యాలు లేని కాటిపేరి గ్రామానికి వైఎస్సార్‌సిపి ప్రభుత్వం రాకతో కాటిపేరి వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకుని కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేపట్టారు. పుంగనూరు నుంచి చదళ్ళ మీదుగా కాటిపేరికి 6 కిలో మీటర్ల తారు రోడ్డు వేశారు. అలాగే పుంగనూరు నుంచి భగత్‌సింగ్ కాలనీ మీదుగా 5 కిలో మీటర్లు సిమెంటు రోడ్డు , అడవినాథునికుంట నుంచి కాటిపేరికి 4 కిలో మీటర్ల తారు రోడ్డు . బోయకొండ రోడ్డు నుంచి కాటిపేరికి మూడు కిలో మీటర్లు తారు రోడ్డు , కాగతి నుంచి కాటిపేరికి 5 కిలో మీటర్ల తారు రోడ్లు 5 వేశారు. అలాగే గ్రామంలో మిని బైపాస్ రోడ్డు వేశారు.
వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ….
కాటిపేరి గ్రామంలోని అగస్తిగానిపల్లెలో అచార్య ఎన్‌జిరంగ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు. అలాగే కాటిపేరి వద్ద 136 కెవి సబ్ స్టేషన్‌ను నిర్మించారు. సచివాలయం, ఆర్‌బికె, విలేజ్ క్లీనిక్, హైస్కూల్, ఆర్‌వో ప్లాంట్లు, ఇంటింటా నీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు గ్రామంలో సిమెంటు రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించారు.




Tags:The funeral bier known as ‘Kavadi’