June 26, 2026
Explore
ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్

ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్

June 26, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లెలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ జూన్ 15 నుంచి ప్రారంభమైందని, ఓట్ల తొలగింపుపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే ఓటరు జాబితా సవరణ జరుగుతోందని తెలిపారు. ప్రతి ఇంటికి బీఎల్‌ఓలు వెళ్లి అవసరమైన ఫారాలు అందజేసి, వాటిని నింపడంలో సహాయం చేస్తారని చెప్పారు. ఓటర్లు ఈసీఐ యాప్ లేదా Voters పోర్టల్ ద్వారా కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చని, సందేహాలుంటే బీఎల్‌ఓలు లేదా సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

Tags: Do not believe false propaganda regarding voter deletion: Sub-Collector