రైల్వేకోడూరు ముచ్చట్లు:
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని రైల్వేకోడూరు నియోజకవర్గ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి జయరామయ్య డిమాండ్ చేశారు. ఓబులవారిపల్లి మండలం సున్నపురాళ్లపల్లె కాలువ పనులు చేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనుల్లో యంత్రాల వినియోగాన్ని నిలిపివేసి, కూలీలకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Tags: Employment Guarantee Scheme should continue under the old system: Jayaramayya