June 26, 2026
Explore
అస్వస్థతతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

అస్వస్థతతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

June 26, 2026 | Andhra Pradesh

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం మండలం చెంబకూరు పరిధిలోని దిన్నిమీద దిగువ హరిజనవాడకు చెందిన ఆదెప్ప (40) అలియాస్ తిరుమలప్ప అస్వస్థతతో చికిత్స పొందుతూ మృతి చెందారు. గురువారం అస్వస్థతకు గురికావడంతో మదనపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా, పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

Tags: Man dies while undergoing treatment for illness.