అమరావతిముచ్చట్లు:
ఓటర్లు తమ ఓటు హక్కును మరింత బలోపేతం చేసుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఆన్‌లైన్ ఎన్యుమరేషన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026’లో భాగంగా, ఓటర్లు ఇకపై బీఎల్‌వో ల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా నేరుగా voters.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను సరిచూసుకోవచ్చు. ఓటర్లు తమ ఎపిక్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయి, తమ వివరాలను పాత రికార్డులతో అనుసంధానించి, ఆధార్ ఈ-సైన్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లోనే సురక్షితంగా సబ్మిట్ చేయవచ్చు. ఈ సులభమైన, వేగవంతమైన విధానాన్ని ఉపయోగించుకుని ఓటర్లందరూ వెంటనే తమ ఫారాన్ని పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Tags: Election Commission advises registering voter details online.