June 26, 2026
Explore
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై అవగాహన కార్యక్రమం

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై అవగాహన కార్యక్రమం

June 26, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

పీలేరు పట్టణంలోని వి.ఎస్.ఆర్. కళ్యాణ మండపంలో పీలేరు, కలికిరి, కే.వి.పల్లి మండలాలకు సంబంధించిన సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ సభ్యులు, యువనేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ప్రతి అర్హుడి వద్దకు తీసుకెళ్లాలని, ఒక్క అర్హుడైన ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొంటూ, ఓటరు నమోదు, మార్పులు, సవరణలు, అభ్యంతరాల పరిష్కారంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి , వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి , ఏపీఎండీసీ మాజీ డైరెక్టర్ హరీష్ రెడ్డి , పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి , నల్లారి తిమ్మారెడ్డి , పీలేరు పరిశీలకులు ఉదయ్ , dr.ఇక్బాల్ అహ్మద్ , పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా, ఇప్పటికే ఉన్న వివరాల్లోని పొరపాట్లను సరిదిద్దేలా, అవసరమైన మార్పులు చేర్పులు పూర్తి చేసేలా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య బలోపేతానికి సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ అత్యంత కీలకమైనదని, ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని సూచించారు.

Tags: Awareness program on the Special Summary Revision (SSR) process of the electoral roll.