హైదరాబాద్ ముచ్చట్లు:
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు తమ ప్యాంట్ల నడుము భాగంలో ప్రత్యేక పౌచ్‌లలో పేస్ట్ రూపంలో దాచి తరలిస్తుండగా పట్టుబడ్డారు. రూ.3.36 కోట్ల విలువైన 2.271 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.
Tags; Huge gold haul at Shamshabad airport