పీలేరు ముచ్చట్లు:
పీలేరు లో పీర్ల పండుగకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్లే క్రమంలో కారు ఆటో ను ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కడి కక్కడే ముగ్గురు మృతి చెందారు. పీలేరు మండలం టానా వడ్డిపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పీర్ల పండుగకు వెళ్లి తిరిగి వస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో రేగళ్ల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ముబారక్, మెహరున్ బీ, ఆమె మనవడు వాహిద్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా, 108 అంబులెన్స్ ద్వారా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో రేగళ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Tags: Car rams into auto-rickshaw – Three dead