June 25, 2026
Explore
ఎర్ర చందన అక్రమ రవాణా నిరోధక దళం

ఎర్ర చందన అక్రమ రవాణా నిరోధక దళం

June 25, 2026 | Andhra Pradesh

  • రూ. 2కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం అనంతపురం జిల్లా బొంతవాడ గ్రామ శివార్లలో 108 ఎర్రచందనం దుంగలు డంప్ పై టాస్క్ ఫోర్స్ దాడి ముగ్గురు అనంతపురం జిల్లా స్మగ్లర్లు అరెస్ట్

అనంతపురం ముచ్చట్లు:

 ఎర్ర చందనం అక్రమ రవాణా ను అడ్డు కోవడం లో ప్రతేక ఆపరేషన్ చేపట్టిన రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అనంతపురం జిల్లాకు చెందిన నల్లాని నంద కుమార్( 32) S/o లేట్ నల్లని రామకృష్ణయ్య, D. No. 1-311, రేగిడి కొత్తూర్ గ్రామం మరియు పంచాయతి, పొడరాళ్ల పోస్ట్, బుక్కరాయ సముద్రం మండల, అనతపురం జిల్లా, అతని తో పాటు నల్లాని జయ రామయ్య, బొట్టు రాఘవేంద్ర లను ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికించి డిల్లీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్న ప్రధాన స్మగ్లింగ్ నెట్‌వర్క్ బట్టబయలు.
 టాస్క్ ఫోర్స్ బృందాన్ని టాస్క్ ఫోర్స్ హెడ్ యల్. సుబ్బ రాయుడు ప్రత్యేకంగా అభినందించి రివార్డు లు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శేషాచలం రిజర్వు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో, ఎర్ర చందన అక్రమ రవాణా నిరోధక దళం (RSASTF) హెడ్ ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, మార్గదర్శకత్వంలో, ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ ఎస్పీ. . పీ. శ్రీనివాస్ , ఆడిషినల్ జె. కులశేఖర్ ఆధ్వర్యం లో శేషాచల అడవులలో ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆపరేషన్ లు నిర్వహించడం తో పాటు, ఎర్ర చందనం కేసు లలో ముద్దాయిలు గా ఉంటూ తప్పించుకొని తిరుగుతున్న అంతర రాష్ట్ర స్మగ్లర్లను చట్టం ముందు నిలబెట్టడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.

     అందులో భాగంగా నిన్నటి దినం అనగా 24.06.2026 వతేదీ సాయంత్రం టాస్క్ ఫోర్స్ బృందం మరియు అటవీ సిబ్బంది కి రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ముగ్గురు వ్యక్తులను అనంత పురం జిల్లా, నార్పల మండలం, బొందల వాడ గ్రామ పొలిమేరలో అదుపులోకి తీసుకోని వారి నుండి ఒక కారు తో సహా 109 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.  

పై తెలిపిన ముద్దాయిలు ఒక ముఠా గా ఏర్పడి ఎర్ర చందనం చెట్లు నరికించి వాటిని డంప్ గా చేసి ఎక్కువ మొత్తం లో డబ్బులకు డిల్లీ, తమిళనాడు మరియు కర్ణాటక కు చెందిన భడా ఎర్ర చందనం స్మగ్లర్లు కు అమ్ముకుందాం అని కూలీల ద్వారా శేషాచలం అడవిలో ఎర్ర చందనం చెట్లు నరికించి వాటిని దుంగలు గా చేసి వాటిని అనంత పురం జిల్లా, నార్పల మండలం, అనంత పురం డివిజన్, రేంజ్ మరియు ఫారెస్ట్ సెక్షన్, దుర్గం ఫారెస్ట్ బీటు పరిధి లో బొందల వాడ గ్రామము నుండి బొమ్మలాట పల్లి గ్రామానికి వెళ్ళు మట్టి రోడ్డు మార్గం లో జయరామయ్య కు చెందిన పొలంలో ఉన్న ఒక రేకుల షెడ్ పక్కన డంప్ చేసి దాచిన 109 ఎర్ర చందనం దుంగల తో సహా పై ముగ్గురు వ్యక్తులను మరియు ఒక కార్ ను స్వాదినం చేసుకోవడం అయినది. డిల్లీ, తమిళనాడు మరియు కర్ణాటక లోని ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేయడానికి దర్యాప్తు కొనసాగుతోంది. పట్టుబడిన మొత్తం 109 ఎర్రచందం దుంగలు వాహనము తో సహా విలువ సుమారు 02 కోట్లు గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది.

ఈ స్మగ్లింగ్ లో ఇతర ప్రధాన సూత్రధారులను గుర్తించి వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కేసు లో ఎర్ర చందనం దొంగలు, వాహనం ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, అంతర రాష్ట్ర స్మగ్లర్ ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ బృందాన్ని అభినందించడం తో పాటు వారికి రివార్డ్ లు ఇవ్వడం జరుగుతుంది. మున్ముందు కూడా ఎర్ర చందనం అక్రమ రవాణా నివారణ మరియు స్మగ్లింగ్ చేసే వారి పై కఠిన చర్యలు కొనసాగుతుంది.

Tags:Red Sanders Anti-Smuggling Task Force