పుంగనూరుముచ్చట్లు:
పోలియో మహమ్మారిని నిర్మూలించేందుకు అందరి సహకారంతో పోలియో చుక్కలు వేసే కార్యక్రమం జయప్రదం చేయాలని ఎంపీడీవో అప్పాజి, ఎంఈవో నటరాజరెడ్డి , ముడిబాపనపల్లె పిహెచ్‌సి డాక్టర్ సృజన లు కోరారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేశారు. ఈనెల 28 ఆదివారం చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు చుక్కలు వేయనున్నట్లు వారు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండ చుక్కలు వేయించాలని కోరారు.
Tags; The polio drive scheduled for the 28th must be made a success.