June 25, 2026
Explore
పీర్లచావిడిలో ప్రత్యేక ప్రార్థనలు

పీర్లచావిడిలో ప్రత్యేక ప్రార్థనలు

June 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మొహరం పండుగను పురస్కరించుకుని పట్టణంలోను , మండలంలోని పలు ప్రాంతాలలో పీర్ల చావిడిలో పీర్లకు ప్రత్యేకంగా పూలతో అలంకరించి, ప్రార్థనలు నిర్వహించారు. గురువారం మొహరం పండుగ సందర్భంగా పట్టణంలోని సుబేదారువీధి పీర్లచావిడిలో, కుమ్మరవీధిలో గల మఖాన్‌ వద్ద, మండలంలోని కుమ్మరగుంట, మేలుందొడ్డి గ్రామాల్లో ప్రార్థనలు చేశారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి అగ్నిగుండప్రవేశం చేశారు. శుక్రవారం ఉదయం నుంచి పీర్ల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హిందూముస్లింలు అధిక సంఖ్యలో మొహరం వేడుకల్లో పాల్గొన్నారు.

Tags:Special prayers at the Peerla Chavidi