పుంగనూరుముచ్చట్లు:
ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో ఓట్లు పరిశీలన, మార్పులు, చేర్పులలో ఎలాంటి పొరపాట్లు లేకుండ చూడాలని మున్సిపల్ మాజీ చైర్మన్ అలీమ్‌బాషా సూచించారు. గురువారం పట్టణంలోని ఎల్‌ఐసి కాలనీలో క్షత్రియ సంఘ పార్టీ కార్యదర్శి లక్ష్మణరాజు, కాపు సంఘ నాయకుడు ఎస్‌విటి.సోము, గోకుల్‌వీధి, ఎంబిటి రోడ్డు ప్రాంతాలలో మిధున్‌యువసేన అధ్యక్షుడు రాజేష్ , బజారువీధి, నగరివీధిలో వైఎస్సార్‌సిపి ఇన్‌టెలెక్చువల్ ఫోరం జిల్లా కార్యదర్శి ఆర్‌కె.రామకృష్ణ, కాపుసంఘ నాయకుడు తుంగాకృష్ణమూర్తి, ఎన్‌ఎస్.పేటలో మాజీ కౌన్సిలర్లు రేష్మా, భారతిలు ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి బిఎల్‌వోల దగ్గరుండి పరిశీలన చేశారు. అలీమ్‌బాషా మాట్లాడుతూ రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గ కేంద్రమైన పుంగనూరు నియోజకవర్గంలో ఓట్లను తొలగించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పలురకాలుగా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గంలో ఏ వర్గానికి చెందిన ఓట్లు తొలగించిన చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతి ఇంటికి పార్టీశ్రేణులు, బిఎల్‌వోలు వెళ్లి పకడ్భందిగా ఓటర్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అన్సర్, బావాజాన్, సల్మా, బిఎల్‌వో రమ్యకృష్ణ పాల్గొన్నారు.

Tags:Care must be taken to ensure there are no errors in the SIR.