June 25, 2026
Explore
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11 లక్షల విరాళం

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11 లక్షల విరాళం

June 25, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

శ్రీవారి భక్తులకు నిత్యం ఉచితంగా అన్నప్రసాద సేవలను అందిస్తున్న టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.11 లక్షల విరాళం అందింది.బెంగుళూరుకు చెందిన హైషాని ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ విరాళాన్ని అందించింది. ఈ మేరకు విరాళం డీడీని తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరికి సంస్థ ప్రతినిధులు అందజేశారు.ఈ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags: Rs. 11 lakh donation to SV Annaprasadam Trust