తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో ఆధునీకరించిన డిస్పెన్సరీని గురువారం ప్రారంభించింది.భక్తులకు అత్యవసర వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు డిస్పెన్సరీలో ఈసీజీ, ఆక్సిజన్ సదుపాయం, ఆధునిక వైద్య పరికరాలు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. నలుగురు వైద్యులు, 16 మంది పారామెడికల్ సిబ్బంది సేవలందించనుండగా, 24 గంటల అంబులెన్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, సీఎంఓ డాక్టర్ కుసుమ కుమారి, ఎస్ఎంఓ డాక్టర్ సుహర్ లత, అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డి, డాక్టర్ పద్మజ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఏఈవో ,
పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Modernized dispensary inaugurated at Vaikuntham Queue Complex-2