June 25, 2026
Explore
కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు.. 38 మంది మంత్రుల పై వేటు

కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు.. 38 మంది మంత్రుల పై వేటు

June 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు జాతీయ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పనితీరు ఆశించిన స్థాయిలో లేని మంత్రులను తప్పిస్తారని సమాచారం. అలాగే ఎన్నికల దృష్ట్యా కీలక రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు మంత్రి పదవులు కట్టబెట్టే వ్యూహాన్ని బీజేపీ అమలు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపు 38 మంది మంత్రుల బాధ్యతల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. శ్రీకాంత్‌ షిండే, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, కకోలీ ఘోష్‌ వంటి నేతలకు అవకాశాలు దక్కవచ్చని సమాచారం.

Tags: Major reshuffle in the Union Cabinet; 38 ministers dropped.