పలువురిపై కేసులు
పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని పలు అల్పహార హోటళ్లు, చికెన్‌షాపులు , ప్లాస్టిక్ కవర్ల విక్రయదారులపైన మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి, ఫుడ్‌సేఫ్టి అధికారి కోలాగురులక్ష్మీ ఆధ్వర్యంలో సచివాలయాల శానిటేషన్ కార్యదర్శులు కలసి మంగళవారం దాడులు చేశారు. కాగా ఆనారోగ్యానికి కేరాఫ్ పుంగనూరు హోటళ్లు అన్న శీర్షికన సోమవారం ప్రత్యేక కథనం ప్రచురించడం విధితమే. దీనిపై కోలాగురులక్ష్మీ స్పందించారు. పట్టణంలో ఉదయం నుంచి రాత్రి దాక అన్ని హోటళ్లు, మటన్‌షాపులు, ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో రెండుమూడు రోజులుగా నిల్వ ఉంచిన మాంసము , ఫ్రీజ్‌లో పెట్టడం , ఆహార వస్తువులలో నాణ్యత లేకపోవడాన్ని గుర్తించి వాటిని సీజ్ చేశారు. అలాగే బేకరీలు, రెస్టారెంట్‌లు తనిఖీ చేశారు. ముడియప్ప సర్కిల్‌లోని మటన్‌షాపును సీజ్ చేశారు. బస్టాండ్‌లో గల ఆదిత్యాఫాస్ట్ఫుడ్స్ హోటల్‌పై కేసు నమోదు చేశారు. అలాగే పట్టణంలోని పలు దుకాణాలలో ప్లాస్టిక్ కవర్లు, టీకప్పులు, గ్లాసులను సీజ్ చేశారు. విక్రయదారులకు రూ.3 వేలు చొప్పున జరిమానాలు విధించారు.
Tags: Food safety officials conduct raids on Punganur hotels.