June 23, 2026
Explore
రికార్డులు లేకపోతే వాహనాలు సీజ్‌

రికార్డులు లేకపోతే వాహనాలు సీజ్‌

June 23, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రహదారిపై ప్రయాణించే ప్రతి వాహనానికి సరైన రికార్డులు ఉండాలని, లేకపోతే సీజ్‌ చేస్తామని ఎంవిఐ సుప్రియ హెచ్చరించారు. మంగళవారం ఆమై బైపాస్‌రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్‌, ట్యాక్స్ చెల్లించని వాహనాలను సీజ్‌ చేసి, జరిమానాలు విధించారు. ముఖ్యంగా స్కూల్‌ బస్సులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఓవర్‌స్పీడ్‌, అధిక లోడ్డుతో విద్యార్థులను తరలించడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం, చిన్నపిల్లల బస్సులకు కిటకీలకు మెష్‌ వేయడం , బస్సుకు అన్ని వైపుల సెల్‌ఫోన్‌ నెంబర్లు వేయడంపై పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ వాహనాన్ని రోడ్డుపై ప్రయాణించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈవిషయంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకుని , వాహనాలకు రికార్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

Tags:Vehicles will be seized if there are no records.