June 23, 2026
Explore
గృహనిర్మాణాలు వేగవంతం చేయాలి-పీడీ రమేష్‌రెడ్డి.

గృహనిర్మాణాలు వేగవంతం చేయాలి-పీడీ రమేష్‌రెడ్డి.

June 23, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పేద ప్రజలకు మంజూరు చేసిన గృహ నిర్మాణాలను ఆగస్టు 15లోపు పూర్తి చేయించాలని అన్నమయ్య జిల్లా పీడీ రమేష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో 1442 మందికి గృహాలు మంజూరైందన్నారు. అలాగే నాలుగు మండలాల్లో 4,336 మందిని ప్రధానమంత్రి అవాస్‌యోజన క్రింద గుర్తించి నమోదు చేశామన్నారు. స్థలాలు లేని 580 మందికి పట్టాలు త్వరలో మంజూరు చేస్తామన్నారు. పట్టణ పరిధిలో లబ్ధిదారులకు రూ.2.50 లక్షలతో నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో 4,339 మంది లబ్ధిదారులను గుర్తించామని, వారికి త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. అధికారులు తమ పరిధిలోని లబ్ధిదారులకు అవగాహన కల్పించి, నిర్మాణాలు పూర్తి చేయించాల్సిన బాధ్యత తక్షణమే చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డీఈఈ దీనదయాల్‌రాజు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Housing construction must be expedited – PD Ramesh Reddy.