June 23, 2026
Explore
రైతన్న మీకోసం పటిష్టంగా నిర్వహించాలి

రైతన్న మీకోసం పటిష్టంగా నిర్వహించాలి

June 23, 2026 | Andhra Pradesh

జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ

పుంగనూరుముచ్చట్లు:

రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రతి ప్రాంతంలోను పటిష్టంగా నిర్వహించాలని జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ సూచించారు. మంగళవారం ఏడి శివకుమార్‌, ఏవో రాధతో కలసి చదళ్ల గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ద్వారా సముద్ర ఉపరితలంలో ఉష్ణోగ్రతలు పెరిగి, వాతావరణంపై ప్రభావం ఉంటుందని, దీని కారణంగా వర్షపాతం సాధారణ స్థాయి కన్న తగ్గే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తక్కువ నీటితో పండించే పంటలను ఎంచుకోవాలన్నారు. సూక్ష్మ, బిందునీటి పద్దతులను అవలంభించాలని, ఫారంపాండ్లు ఏర్పరచుకోవాలని, ప్రకృతి వ్యవసాయంతో నెలలో తేమను నిల్వ ఉంచే పద్దతులతో వ్యవసాయం చేయాలన్నారు. అలాగే పిఎండిఎస్‌ విత్తనాలను సాగు చేసుకుని , పశువులకు మేత, పచ్చరొట్ట ఎరువులుగా రెండు విధాలుగా ఉపయోగించుకోవాలన్నారు. బోరు బావుల క్రింద వరిపంటలు తగ్గించాలని కోరారు.

Tags: Robust arrangements must be made for the farmers.