పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని చదళ్ల గ్రామ సమీపంలో ద్విచక్రవాహనం పై నుంచి క్రిందకు పడి మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు మండలంలోని పూజగానిపల్లెకి చెందిన మునిరాజు, రత్నమ్మ(34) దంపతులు ద్విచక్రవాహనంలో సొంత పనులపై చౌడేపల్లెకు వెళ్లారు. మార్గమధ్యంలోని చదళ్ల వద్ద రత్నమ్మ వాహనం నుంచి జారి క్రిందపడిపొయింది. వెంటనే స్థానికుల సహాయంతో ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేపట్టారు.
Tags:Woman dies after falling from two-wheeler