June 23, 2026
Explore
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత

ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత

June 23, 2026 | Andhra Pradesh

జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా…

నరసరావుపేట ముచ్చట్లు:

నరసరావుపేట లోని మార్కెట్ యార్డ్ వద్ద నున్న ఈవిఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ కృతిక శుక్లా మంగళవారం త్రైమాసిక త‌నిఖీ నిర్వహించారు. గోదాము ష‌ట్ట‌ర్ల‌కు వేసిన సీళ్ల‌ను, తాళాల‌ను తెరిపించి లోపలి గదులను, సీళ్లను ప‌రిశీలించారు. పోలీసు బందోబ‌స్తుపై స‌మీక్షించారు. సిసి కెమేరాల ద్వారా చుట్టుప్ర‌క్క‌ల‌ పరిస్థితులను ప‌రిశీలించారు. సిబ్బంది అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను,పోలీసు సిబ్బందిని ఆదేశించారు.ఈ తనిఖీలో జిల్లా రెవిన్యూ అధికారి అద్దయ్య ,ఆర్దీవో బాలకృష్ణ ,రాజకీయ పార్టీల ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.

Tags; Tight security at EVM warehouses