June 23, 2026
Explore
స్నేహం అని నమ్మి వెళ్లిన ఫ్రండ్ ని దారుణ హత్యరు..

స్నేహం అని నమ్మి వెళ్లిన ఫ్రండ్ ని దారుణ హత్యరు..

June 23, 2026 | Andhra Pradesh

! మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి.. చావు కబురు ఫోన్లో చెప్పిన ఫ్రెండ్స్

ఈ రోజుల్లో గుడ్డి గా స్నేహం ని నమ్మితే….ప్రాణాలు గాల్లో పోయినట్టే!

ప్రకాశం జిల్లా ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలోని ఎస్‌సి కాలనీలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన అశోక్‌ అనే వ్యక్తిని అతనితో స్నేహంగా ఉంటున్న నలుగురు యువకులే కత్తులతో దారుణంగా పొడిచి చంపేశారు. రాత్రి పూట పని ఉందంటూ అశోక్‌ను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్ళి అనంతరం రోడ్డుపై కత్తులతో పొడిచారు. తీవ్ర గాయాలతో అశోక్‌ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తరువాత నిందితులే అశోక్‌ బంధువులకు ఫోన్‌ చేసి చంపేశామని తెలియచేశారు. ఎక్కడ చంపి పడేశారో కూడా చెప్పారు. దీంతో అశోక్‌ బంధువులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాలించారు. రోడ్డుపై అశోక్‌ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.

హత్యకు గురైన అశోక్‌కు పెళ్లై, పిల్లలున్నారు. అతని స్నేహితులు అందరూ కలిసి పెయింటింగ్‌ పనులు చేసుకుంటూ కాలనీలో ఉంటున్నారు. తరచూ మద్యం సేవిస్తుంటారు. కలిసి క్రికెట్‌ కూడా ఆడుతుంటారు. వీరిలో కొంతమందికి గంజాయి అలవాటు కూడా ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో స్నేహితులే అశోక్‌ను నమ్మకంగా ఇంటినుంచి తీసుకెళ్లి దారుణంగా చంపేయడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, వీరిలో కొంతమంది గంజాయి కూడా తాగుతుంటారని చెబుతున్నారు. మద్యం, గంజాయి మత్తులో చంపేశారా..? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది తమకు తెలియదని బంధువులు చెబుతున్నారు.

ఈకేసులో ఎస్‌ఐ మూడు స్టేట్‌మెంట్లు రాసి సంతకం పెట్టాలని కోరగా, అందుకు నిరాకరించి తమకు ఉన్న అనుమానాలతో ఫిర్యాదు ఇచ్చామని చెబుతున్నారు. హత్యకు గురైన అశోక్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కొద్దిసేపు జిజిహెచ్‌ ఎదుట బంధువులు రాస్తారోకో చేశారు.

Tags: A friend was brutally murdered after going along, trusting in the friendship.