June 23, 2026
Explore
భర్త నుంచి ప్రాణహాని.. ఎస్పీకి ఫిర్యాదు

భర్త నుంచి ప్రాణహాని.. ఎస్పీకి ఫిర్యాదు

June 23, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లాముచ్చట్లు:

భర్త నుంచి ప్రాణహాని ఉందని ఓ యువతి అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చేసింది. లక్కిరెడ్డిపల్లి మండలం, మద్దిరేవుల పంచాయతీ, అప్పలరాజుగారి పల్లెకు చెందిన రామరాజు ట్రాన్స్‌కోలో కాంట్రాక్టు లైన్మెన్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య ఎస్.లలిత ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందించింది. 2014లో తాను బిడ్డల్ని పుట్టినింటిలో వదలి బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి 2019లో తిరిగి వచ్చానని తెలిపింది. ఆరు తులాల బంగారం, సుమారు 5 లక్షల నగదు భర్తకు ఇచ్చానని లలిత తెలిపింది. అంతా వాడేసి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనపైనే నిందలు వేస్తున్నాడని ఆరోపిం చింది. తనను అంతమొందిం చాలని చూస్తున్నాడని, భర్త తో పాటు అతని స్నేహితులుతో కలిసి చంపడానికి కుట్ర పన్నారని వాపోయింది. ప్రాణహాని ఉందని భయంతో మూడు నెలల క్రితం కాకులారంలోని పుట్టింటికి వచ్చానని, అక్కడ కూడా దాడి చేసి వేధిస్తుండడంతో మదనపల్లె కు వచ్చి తలదాచుకుంటున్నానని కన్నీటి పర్యంత మైంది. పోలీసులు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Tags: Threat to life from husband… Complaint lodged with SP