మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రకటించడం తప్ప రెండేళ్లుగా చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదన్నారు. మెడికల్ కాలేజ్, బీటీ కళాశాల నిర్మాణాలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. పట్టణంలో రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధి పనులు సైతం ఆశించిన స్థాయిలో లేవని ఆరోపించారు. మదనపల్లె చుట్టూ అవకతవకలు, అసంపూర్తి పనులే కనిపిస్తున్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Tags; Zero development in Madanapalle… Where are the promises? MP criticizes.