June 23, 2026
Explore
పడకగదికి సీసీ కెమెరా అమర్చారని ఎస్పీకి ఫిర్యాదు

పడకగదికి సీసీ కెమెరా అమర్చారని ఎస్పీకి ఫిర్యాదు

June 23, 2026 | Andhra Pradesh

మదనపల్లెముచ్చట్లు:

మదనపల్లె మండలం పోతబోలు గ్రామానికి చెందిన భాస్కర్ తన పడకగదిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు గంగులప్ప, జయలక్ష్మి సీసీ కెమెరా ఏర్పాటు చేశారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. కెమెరాలో రికార్డైన వ్యక్తిగత వీడియోలను సెల్‌ఫోన్ల ద్వారా బహిర్గతం చేస్తూ తనను అవమానిస్తున్నారని ఆరోపించాడు. తన భార్యతో ఉన్న వ్యక్తిగత క్షణాలను కూడా చిత్రీకరిస్తున్నారని వాపోయాడు. గతంలోనూ తప్పుడు ఆరోపణలతో పరువు తీసేందుకు ప్రయత్నించారని పేర్కొంటూ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

Tags: Complaint lodged with SP alleging installation of CC camera in bedroom.