June 23, 2026
Explore
అతిగా మద్యం సేవించి నాయి బ్రాహ్మణుడు మృతి

అతిగా మద్యం సేవించి నాయి బ్రాహ్మణుడు మృతి

June 23, 2026 | Andhra Pradesh

మదనపల్లెముచ్చట్లు:

మదనపల్లెలో అతిగా మద్యం సేవించడం వల్ల ఓ నాయి బ్రాహ్మణుడు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సత్యసాయి జిల్లా కదిరి పిల్లవంక కాలనీకి చెందిన నారాయణ స్థానికంగా బార్బర్ షాపు నిర్వహించేవాడు. మృతుడి భార్య భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, నారాయణ గత ఐదు రోజులుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే అధికంగా మద్యం సేవిస్తున్నాడు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం స్విమ్స్‌కు తరలించారు. అయితే మార్గమధ్యంలో మదనపల్లె వద్ద ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Tags: Nayi Brahmin dies after excessive alcohol consumption.