మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె పట్టణంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. తంబళ్లపల్లె నియోజకవర్గం పీటీఎం మండలం మల్లెల గ్రామానికి చెందిన లేట్ రోహిత్ రెడ్డి (13) స్థానిక ప్రైవేట్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్నాడు. మూడు రోజుల క్రితం విద్యార్థి కనిపించకపోవడంతో పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అనంతరం కుటుంబ సభ్యులు బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Tags: 8th-grade student goes missing in Madanapalle.