June 23, 2026
Explore
అత్తింటి వేధింపులతో నవవధువు ఆత్మహత్యాయత్నం

అత్తింటి వేధింపులతో నవవధువు ఆత్మహత్యాయత్నం

June 23, 2026 | Andhra Pradesh

మదనపల్లెముచ్చట్లు:

మదనపల్లెలో అత్తింటి వేధింపులను తట్టుకోలేక ఓ నవవధువు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఎనుములవారిపల్లికి చెందిన మౌనిక (20)కు నాలుగు నెలల క్రితం పీలేరు ఇందిరమ్మ కాలనీకి చెందిన యువకుడితో వివాహం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, భర్తతో సఖ్యత లేదని అత్తింటివారు మౌనికను వేధించడంతో ఆమె పుట్టింటికి చేరుకుంది. భర్త తనను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం లేదని తల్లిదండ్రులకు తెలిపింది. వారు సర్దుకుపోవాలని సూచించడంతో మనస్తాపానికి గురైన మౌనిక విషం తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకుంటోంది. ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Newlywed attempts suicide due to harassment by in-laws.