మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె పట్టణంలోని ఎన్‌వీఆర్ లేఅవుట్‌కు చెందిన అబ్దుల్ ముస్తఫా, షేక్ షర్మిల దంపతులు పుట్టుకతోనే చెవిటి, మూగ దివ్యాంగులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నప్పటికీ షర్మిలను మృతురాలిగా నమోదు చేసి రేషన్ కార్డులో నుంచి పేరు తొలగించినట్లు ఐటీయూసీ డివిజన్ కన్వీనర్ జి.కృష్ణమూర్తి ఆరోపించారు. దీంతో కుటుంబానికి ముగ్గురికే రేషన్ అందుతోందని తెలిపారు. పలుమార్లు ఆధార్ కార్డు చూపించినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ విషయంపై సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదికలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి, షర్మిల పేరును తిరిగి రేషన్ కార్డులో చేర్చి న్యాయం చేయాలని కోరారు.
Tags: Name removed from ration card by falsely declaring a living woman dead.