తిరుపతి ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని 2026, జూలై 07న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో 7,938 కిలోల మిశ్రమ బియ్యాన్ని (20 లాట్లు) విక్రయిస్తారు. ఈ వేలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఆక్షన్ ఐడీ నెం. 26120 కింద జరగనుంది.
వేలంలో పాల్గొనదలచిన వారు రూ.50,000 ఈఎండీ చెల్లించాలి. వివరాలకు http://konugolu.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అలాగే టీటీడీ వేలాల విభాగం జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్ నంబర్‌లో లేదా gmauctionsttd@gmail.com ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
Tags; E-auction of 7,938 kg of mixed rice