వై ఎస్ ఆర్ టియుసి నాయకుల హేచ్చరిక
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పణ
తిరుపతి ముచ్చట్లు
ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ పరం చేయాలనే ఆలోచనలో ఉందని,అటువంటి ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని వై ఎస్ ఆర్ టి యు సి జోనల్ ఇంచార్జ్ నారపరెడ్డి రాజారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విశ్వనాధ రవి,, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గోవిందరాజులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం విజయవాడ లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ లక్ష్మి షా కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మీడియా తో మాట్లాడుతూ ఆర్టీసీ చక్రం ప్రజాప్రగతికి సింహం అనేది ఒకప్పటి నానుడి అని,ఇప్పుడు అటువంటి పరిస్థితి కనుమరుగ అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలనే ఆలోచన విరమించుకోవాలని వైస్సార్ టి యూ సి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల పట్ల,ప్రజల పాలిట వ్యవహరిస్తున్న తీరు కర్కాటకంగా మారిందన్నారు. 2015 -16 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 59,300 ఉంటే ఇప్పుడు 4300 కు తగ్గిందన్నారు. గతంలో అద్య బస్సులతో కలిపి ఆర్టీసీలో 12,500 బస్సులు ఉంటే,ఇప్పుడు ఆ సంఖ్య పదివేల700 వచ్చిందన్నారు.గత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 2023లో ఏడు కోట్ల పైచిలుకు నిధులు వెచ్చించి 459 బస్సులు కొనుగోలు చేశారని,ఎన్నికలు రావడంతో రోడ్లపైకి తెచ్చేందుకు అవకాశం కలగలేదు అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బస్సులను వారి ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం 2025 ఆగస్టు నుండి స్రీ శక్తి పథకం ప్రవేశపెట్టి ఆర్టీసీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుందని అన్నారు. సుమారు 25 లక్షలు మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని ఇందుకుగాను ప్రభుత్వం నుండి ఆర్టీసీకి నెలకు 250 కోట్లు జమ చేయాల్సి ఉంటే ప్రభుత్వం కేవలం 120 కోట్లు మాత్రమే జమ చేస్తూ, సుమారు 100 కోట్ల మేర ఎగవేసే కార్యక్రమానికి పాల్పడుతుందని ఆరోపించారు.ఉచిత ప్రయాణం వలన 68% ఉన్న ఆక్యుపెన్సి రేషియో ఏకంగా 92 నుండి 98 శాతానికి పెరిగిందని అదే స్థాయిలో బస్సుల సంఖ్యను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినట్టే ఇచ్చి సమస్థను నష్టాలు పాలు చేసి, ఒక పథకం ప్రకారం ప్రైవేటు వ్యక్తులకు ఆర్టీసీ సమసంస్థ ఆస్తులను ధారాదత్తం చేయాలనే కుట్ర స్పష్టమవుతుందని పేర్కొన్నారు.ప్రజావసరాల మేరకు అవసరమైన 3000 డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని,ఆర్టీసీ సమస్థ మనుగడ కోల్పోకుండా ఉండేలా అవసరమైన 11,000 మంది ఉద్యోగల భర్తీ చేయాలని,రాష్ట్రంలోని బస్సు డిపోలను 99 ఏళ్ల అద్దె ప్రాతిపదికన లీజుకి ఇచ్చే ప్రతిపాదన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ ధోరణి ఇలాగే కొనసాగితే అన్ని ప్రజా సంఘాలు ప్రజల సహకారంతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని,ఆర్టీసీని ప్రైవేటుపరం కాకుండా అడ్డుకునేందుకు,ఆ దిశ గా ప్రయత్నం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో వైయస్సార్ టి యు సి రాష్ట్ర కార్యదర్శి జీ. వి. నారాయణ రెడ్డి, జిల్లా నాయకులు ఎస్ కే అక్బర్, ఎం. రామారావు, బి. రాజేష్ ఎస్. నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags: We will stop the privatization of RTC.