June 22, 2026
Explore
బాలిక ఆలియ వైద్యానికి రూ.40 వేలు విరాళం

బాలిక ఆలియ వైద్యానికి రూ.40 వేలు విరాళం

June 22, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పెద్దమండ్యం మండలం , సాయిబులవారిపల్లెలో నివాసం ఉన్న జబివుల్లా, తహరీన్‌ దంపతులకు ఆలియ (10) కుమారై గుండెజబ్బుకు రూ.40 వేలు విరాళం అందజేశారు. సోమవారం వైఎస్సార్‌సిపి జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు, ఎస్‌టిఎఫ్‌ సిద్ధిక్‌ ఆధ్వర్యంలో ముస్లింయూత్‌ బాధిత కుటుంభానికి విరాళం అందించారు. కాగా బాలిక చికిత్సకు ఎంపి మిధున్‌రెడ్డి చేయూతనిచ్చారు. ఆయన స్పూర్తితో సిద్ధిక్‌ విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సిపి నాయకులు బిఎంఎస్‌.సిద్దు, బాబుల్లి, షఫి, మౌల, షాహీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Rs. 40,000 donated for young girl Aliya’s medical treatment.