మాజీ ఎంపి రెడ్డెప్ప
పుంగనూరుముచ్చట్లు:
ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో ఓట్లు తొలగిపోకుండ పారదర్శకంగా జాబిత సిద్ధం చేయడంలో వైఎస్సార్‌సిపి క్యాడర్ పనితీరు ఎంతో కీలకం అని చిత్తూరు మాజీ ఎంపి ఎన్.రెడ్డెప్ప తెలిపారు. సోమవారం మున్సిపల్ మాజీ చైర్మన్ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, మాజీ కౌన్సిలర్ నరసింహులుతో కలసి ఎంబిటి రోడ్డు, హిదాయత్ నగర్ ప్రాంతాలలో ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ చేశారు. పార్టీ బిఎల్‌వోలు దగ్గరుండి ఓటర్ల పరిశీలన నిర్వహించారు. మాజీ ఎంపి మాట్లాడుతూ రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గ కేంద్రమైన పుంగనూరు నియోజకవర్గంలో ఓట్లను తొలగించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఏజెన్సికి కేటాయించిందని ఆరోపించారు. దీని ద్వారా స్థానిక రెవెన్యూ కార్యాలయాలలో ఏజెన్సి సభ్యులు కుర్చోని ఓటర్లను తొలగించే కార్యక్రమం నిర్వహిస్తారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఏ వర్గానికి చెందిన ఓట్లు తొలగించిన చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతి మండలంలోను పార్టీశ్రేణులు, బిఎల్‌వోలు పకడ్భందిగా ఓటర్ల పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. అధికారులు అధికార పార్టీకి తలవంచకుండ నిజాయితీగా పని చేయాలని కోరారు.
Tags: The performance of the YSRCP cadre is crucial in the SIR.