నారాయణ పాఠశాల వద్ద విద్యార్థి సంఘాలు ధర్నా
- విద్యార్థులపై అక్రమ కేసు నమోదు
పుంగనూరుముచ్చట్లు:
అధికార పార్టీకి చెందిన మంత్రికి సంబంధించిన నారాయణ పాఠశాల అక్రమాలను , యాజమాన్యం విద్యార్థులను దోపిడి చేయడంపై ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకులపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి , స్వామి భక్తి చాటుకున్న సంఘటన పుంగనూరులో జరిగింది. పట్టణంలోని సూర్యనగర్‌లో గల నారాయణ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం పుస్తకాలు, బ్యాగులను చట్టవిరుద్ధంగా విక్రయిస్తూ తల్లిదండ్రుల వద్ద వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని శనివారం ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి కార్యదర్శి మున్నా, ఓబిసి సంఘాల ప్రతినిదులు సురేష్‌యాదవ్, విక్రమ్ యాదవ్, వెంకట్‌యాదవ్ లు శాంతియుతంగా నిరసన తెలిపి , ధర్నాను నిర్వహించారు. ఈ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థి నాయకుల ధర్నాను విరమింపజేశారు. కానీ అక్కడితో కథ ముగియలేదు. దీనిపై ప్రిన్సిపాల్ పవన్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫిర్యాదు మేరకు నలుగురు విద్యార్థి సంఘాల నాయకులపై ఎఫ్‌ఐఆర్ నెంబరు: 151 /2026 కేసును సెక్షన్ల 329(4), 351(2), 126(2), 292రెడ్‌విత్(3)5 బిఎన్‌ఎస్ క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. శాంతియుతంగా అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తారా అంటు నిలధీస్తున్నారు. అధికార పార్టీ వారు తమకు అడ్డు వచ్చిన వారిని , ప్రశ్నించిన వారిని పోలీసులను అడ్డుపెట్టుకుని కేసులు నమోదు చేయడం పలు విమర్శలకు దారితీస్తోంది.
Tags; If you question… false cases.