June 21, 2026
Explore
బాలిక ఆలియ వైద్యానికి ఎంపి మిధున్‌ చేయూత

బాలిక ఆలియ వైద్యానికి ఎంపి మిధున్‌ చేయూత

June 21, 2026 | Andhra Pradesh

చికిత్సకు బెంగళూరు తరలింపు

పుంగనూరుముచ్చట్లు:

ఓ పేద బాలిక గుండెజబ్బుతో బాధపడుతుండటాన్ని చూసి రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి చలించిపోయారు. తక్షణమే ఆదివారం బాలికను బెంగళూరులోని వైదేహి ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయాలని సూచించారు. పెద్దమండ్యం మండలం , సాయిబులవారిపల్లెలో నివాసం ఉన్న జబివుల్లా, తహరీన్‌ దంపతులకు ఆలియ (10) కుమారై ఉంది. ఈ బాలిక గుండెజబ్బుతో బాధపడుతోంది. చికిత్సలకు లక్షలాది రూపాయలు కావడంతో తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సిపి జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు , పుంగనూరుకు చెందిన ఎస్‌టిఎఫ్‌ సిద్ధిక్‌ కు సమాచారం తెలిసి ఆయన వెంటనే ఎంపి మిధున్‌ వద్దకు తల్లిదండ్రులను , బాలికను తీసుకెళ్లారు. ఎంపి తక్షణమే బాలికకు అవసరమైన ఆపరేషన్లకు ఆర్థిక సహాయం అందిస్తామని ఎంపి భరోసా కల్పించి , బాలికను బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఎంపికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సిపి నాయకులు సిద్దు, బాబుల్లి, షఫి తదితరులు పాల్గొన్నారు.

Tags; MP Mithun extends support for young girl Aliya’s medical treatment.